Hyderabad: Non-stop obscene dances..Cubble Masti Pub Siege
mictv telugu

హైదరాబాద్: ఆగని ఆశ్లీల నృత్యాలు..కబ్ల్ మస్తీ పబ్ సీజ్

June 4, 2022

Hyderabad: Non-stop obscene dances..Cubble Masti Pub Siege

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న పబ్బుల్లో ఆశ్లీల నృత్యాల ప్రదర్శన ఆగటం లేదు. గతరాత్రి (శుక్రవారం) కేపీహెచ్‌బీలోని మంజీరా మెజెస్టిక్ కమర్షియల్‌లో ఉన్న క్లబ్ మస్తీ పబ్‌పై మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసుల దాడులు చేశారు. 9 మంది యువతులను, మేనేజర్‌ను, డేజె ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకొని, పబ్‌ను సీజ్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..” పబ్‌లో పరిమితికి మించి డిజె సౌండ్‌తో పబ్‌ను నడుపుతున్నారు. పబ్ యాజమాన్యం కస్టమర్లను ఆకట్టుకునే విధంగా కొంతమంది యువతులతో అర్థనగ్నంగా నృత్యాలు చేస్తున్నారు. 9 మంది యువతులను, మేనేజర్ ప్రదీప్ కుమార్, డేజె ఆపరేటర్ దనరాజగ్, కస్టమర్ సాయి సంతోష్‌లను అరెస్ట్ చేశాం. డిజే మిక్సర్, హుక్కా ప్లేవర్లు స్వాధీనం చేసుకున్నాం. నిందితులను కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించాం’ అని వివరాలను వెల్లడించారు.