హైదరాబాద్‌లో వాన బీభత్సం.. 9 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో వాన బీభత్సం.. 9 మంది మృతి

October 14, 2020

హైదరాబాద్‌ వర్షం భారీ నష్టాన్నిమిగిల్చింది. ఓ వైపు వరద ఇళ్లలోకి పోటెత్తగా మరికొన్ని ప్రాంతాల్లో నివాస సముదాయాలు కూలిపోయాయి. పాతబస్తీలో రెండు ఇండ్లు కూలిపోవడంతో దాదాపు 9 మంది చనిపోయారు. చాంద్రాయణగుట్టలోని  గౌస్‌ నగర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు మృతదేహాలను బయటకు తీశారు. 

భారీ వర్షం కారణంగా  ఎత్తైన ప్రదేశంపై ఉన్న ఇళ్లపై బండరాళ్లు జారిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రెండు ఇండ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో ఓ ఇంట్లో ఐదుగురు.. మరో ఇంట్లో నలుగురు మరణించారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మరోవైపు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఘటన ప్రాంతానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కాగా, నగరంలో నిన్న ఒక్కరోజే అత్యధికంగా 32 సెం.మీ వర్షాపాతం నమోదు అయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.