ముసలోడి పైత్యం.. అద్దెగర్భం వద్దు, సహజంగానే కందాం - MicTv.in - Telugu News
mictv telugu

ముసలోడి పైత్యం.. అద్దెగర్భం వద్దు, సహజంగానే కందాం

February 20, 2020

హైదరాబాద్‌లో 64 ఏళ్ల ముసలోడు 22 ఏళ్ల వివాహితతో తన వింత కోరిక బయటపెట్టాడు. అద్దె గర్భం ద్వారా తనకు ఓ బిడ్డ కావాలని ఒప్పందం చేసుకొని, చివరకు సహజంగానే పిల్లలను కందామంటూ మాట మార్చాడు. దానికి ఆ మహిళ ఒప్పుకోకపోవడంతో పేదరికాన్ని ఆసరాగా చేసుకొని ఆమెను బెదిరిస్తూ వేధింపులకు దిగాడు. ఆ ముసలాడి చర్యతో విసిగిపోయిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్త ప్రారంభించారు. 

Hyderabad Old Man Forced 22 Years Old Women

చిలకగూడకు చెందిన పూజ సురేశ్‌ పవార్‌(22), ఎండీ మజ్హేరుద్దీన్‌ దంపతులు చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. వారి పరిస్థితిని చూసిన మహ్మద్ నూర్ అనే ఓ మహిళ అద్దె గర్భం ద్వారా పిల్లలను కని ఇస్తే డబ్బులు వస్తాయంటూ ఆశ చూపింది. వెంటనే సురేశ్ పవార్‌కు సోమాజిగూడకు చెందిన స్వరూప రాజు(64) అనే వృద్ధుడిని పరిచయం చేసింది. అద్దె గర్భం కోసం రూ. 4.5 లక్షలు ఇచ్చేందుకు  గతేడాది డిసెంబర్ 24న వీరి మధ్య ఒప్పందం జరిగింది. దీనితో పాటు బిడ్డ పుట్టే వరకూ నెలకు రూ. 10 వేల చొప్పున ఇవ్వాలని రాసుకున్నారు. 

అన్ని కుదరడంతో ఫిబ్రవరి11న స్వరూప రాజు, సురేశ్ పవార్ కలిసి బిర్లా మందిర్ వెళ్లారు. అక్కడ పూజలు చేసిన తర్వాత తిరిగి కారులో వస్తుండగా స్వరూప రాజు తన వక్ర బుద్ధిని బయటపెట్టాడు.  సరోగసి ద్వారా కాకుండా, సహజంగానే పిల్లలను కందామంటూ చెప్పాడు. ఇందుకు అదనంగా మరో రూ. 50 వేలు ఇస్తానని తన ప్రతిపాదనకు అంగీకరించాలని అన్నాడు. కానీ దానికి సురేశ్ పవార్ అంగీకరించలేదు. దీంతో ఆమెను తరుచూ ఫోన్ చేసి లైంగికంగా వేధించేవాడు. అతడి చర్యతో విసిగిపోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.