పార్క్ హయత్ హోటల్లో అత్యాచారం.. తర్వాత కూడా వార్నింగ్.. - MicTv.in - Telugu News
mictv telugu

పార్క్ హయత్ హోటల్లో అత్యాచారం.. తర్వాత కూడా వార్నింగ్..

October 13, 2020

Hyderabad park hyatt hotel incident.j

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న పార్కు హయత్ హోటల్‌లో జరిగిన అత్యాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలికి క్రిష్ణ చౌదరి అనే వ్యక్తి ద్వారా ప్రజక్త అనే యువతి ముంబైలో పరిచయం అయింది. అన్షూ కుక్రేజా అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని మీ ఇంట్లో రక్షణ కల్పించాలని బాధితురాలిని ప్రజక్త కోరింది. అందుకు బాధితురాలి ఒప్పుకుంది. ప్రజక్త బాధితురాలి ఇంట్లో ఆశ్రయం పొందింది. మే10న స్వీటీ అనే యువతి ప్రజక్తకు కాల్ చేసి హైదరాబాద్‌లో జుబేర్‌ అనే ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ రావాలని ఆహ్వానించింది. మే11న బాధితురాలు ప్రజక్తతో కలిసి హైదరాబాద్‌కు వచ్చింది. వీరు పార్క్ హయత్ హోటల్‌లో బస చేశారు. అదే రోజు రాత్రి స్వీటీ, జుబేర్‌లు హోటల్‌కు వెళ్లి పుట్టినరోజు వేడుకలు‌ నిర్వహించారు. ఈ క్రమంలో ప్రజక్త, స్వీటీ, జుబేర్‌లు బాధితురాలికి బలంవంతగా మద్యం తాగించారు. 

జుబేర్‌ బాధితురాలిని రేప్ చేశాడు. అనంతరం స్వీటీతో కలిసి హోటల్‌ నుంచి వెళ్లిపోయాడు. బాధితురాలు మే14న ముంబైకి చేరుకుంది. ముంబై పోలీసులను ఆశ్రయించి జుబేర్‌పై కేసు పెట్టింది. ఈ కేసు ముంబై పోలీసుల దగ్గర పెండింగ్‌లో ఉంది. ఈ కేసును వెనక్కి తీసుకోవాలని జుబేర్ బాధితురాలిపై ఒత్తిడి తెస్తున్నాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో తాజాగా బాధితురాలి న్యూడ్ వీడియోలను జుబేర్‌ ఆమెకు వాట్సాప్‌ ద్వారా పంపించాడు. కేసు వాపసు తీసుకోవాలని లేకుంటే వీడియోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు మరోసారి ముంబై పోలీసులను ఆశ్రయించింది. ఈసారి స్వీటీ, ప్రజక్తలపై కూడా ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లో జరగడంతో ముంబై పోలీసులు బంజారహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు కేసును బదిలీ‌ చేశారు. కేసు నమోదు చేసుకున్న బంజారహిల్స్‌ పోలీసులు నిందితులు కోసం గాలిస్తున్నారు.