ఎట్టకేలకు చిక్కిన చెడ్డి గ్యాంగ్‌… రాచకొండ పోలీసులే - MicTv.in - Telugu News
mictv telugu

ఎట్టకేలకు చిక్కిన చెడ్డి గ్యాంగ్‌… రాచకొండ పోలీసులే

September 26, 2018

చెడ్డి గ్యాంగ్ ఈ పేరు వినగానే ప్రజలు హడలిపోయారు. వారు ఎటునుంచి వస్తున్నారో తెలియదు. రాత్రి వేళల్లో ఒంటి మీద కేవలం చెడ్డీ ధరించి వచ్చి ఇళ్ళను దోచుకెళ్తున్నట్టు సీసీటీవీ రికార్డుల్లో చూశాం. అవసరమైతే దాడులు చేసి మరీ ఇళ్ళను దోచుకెళ్తారు. చెడ్డి గ్యాంగ్ దొంగతనం చేయడంలోనే కాదు, తప్పించుకోవడంలోనూ దిట్టలే. ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసిన చెడ్డి గ్యాంగ్‌ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.Hyderabad police arrested cheddi gangతెలంగాణ, ఏపీలో కలకలం సృష్టించిన చెడ్డి గ్యాంగ్ ఎట్టకేలకు పట్టుబడింది. వారిని గుజరాత్‌లో హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. చెడ్డి గ్యాంగ్ కోసం పోలీసులు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలలో తీవ్రంగా గాలించారు.  గుజరాత్ రాష్ట్రంలో నెలరోజులుగా పహారా కాచి చివరకు దహోడ్ అనే ప్రాంతంలో నలుగరిని పట్టుకున్నామని హైదరాబాద్ రాంచకొండ పోలీసులు తెలిపారు. మిగతావారు పరారీలో ఉన్నారని వెల్లడించారు. వీరిపై తెలంగాణ రాష్ట్రంలో 29 కేసులు ఉన్నాయి. ఏపీలో మరో పది కేసులు ఉన్నాయని చెప్పారు. గతంలో అమీర్ పేట, ఎల్బీనగర్ ప్రాంతంలో దొంగతనాలు చేశారు. వీరి నుంచి 100 గ్రాముల బంగారం, 1కేజీ వెండిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. రాజకొండ సీపీ మోహన్ భగవత్ మాట్లాడుతూ…

‘అమీర్ పేటలో దొంగతనం చేసినప్పడు, వీరి ఫింగర్ ప్రింట్‌లు దొరికాయి. వాటి ఆధారంగా ఆ గ్యాంగ్ సభ్యుడు రాజ్ బావోజీగా గుర్తించాము. గుజరాత్‌లో అరెస్టు చేసి, అక్కడి న్యాయస్థానం ముందు హాజరుపరిచి, హైదరాబాద్ తీసుకువచ్చాం’ అని తెలిపారు.