hyderabad police arrested goshamahal MLA rajasingh
mictv telugu

రాజాసింగ్ అరెస్ట్.. రహస్య ప్రాంతానికి తరలింపు

August 25, 2022

hyderabad police arrested goshamahal MLA rajasingh

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు మరోసారి తాజాగా అరెస్ట్ చేశారు. గతంలో నమోదైన రెండు కేసుల విషయంలో రాజాసింగ్‌కు గురువారం ఉదయం పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మంగళ్ హాట్, షాహినాయత్ గంజ్ పోలీసులు ఆయన నివాసానికి రాగా, ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి.

ఆరు నెలల క్రితం నమోదైన కేసులో ఇప్పుడెందుకు నోటీసులు ఇస్తున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు. అయితే నిబంధనల మేరకే తాము నడుచుకుంటున్నామని, సహకరించాలని పోలీసులు కోరారు. అనంతరం భారీ సంఖ్యలో బలగాలు రాజాసింగ్ నివాస పరిసరాలకు రాగా, పోలీస్ ఉన్నతాధికారులు రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య అక్కడి నుంచి తరలించారు. అయితే మంగళ్ హాట్ పోలీస్ స్టేషనుకి కాకుండా ఓ రహస్య ప్రాంతానికి తరలించారని సమాచారం. రేపు శుక్రవారం కావడంతో పాతబస్తీలో నిరసనలు, ఆందోళనలు వ్యక్తం కాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. అటు రాజాసింగ్‌ను నాంపల్లి కోర్టకు తరలించి రిమాండ్ విధించే అవకాశాలున్నాయని పోలీస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరి ఏం జరుగనుందో సాయంత్రానికి తేలిపోనుంది.