Hyderabad police arrested Zaved
mictv telugu

హైద్రాబాదులో ఉగ్ర కుట్ర భగ్నం.. పోలీసుల అదుపులో పది మంది

October 2, 2022

తెలంగాణ రాజధాని హైద్రాబాదులో ఉగ్ర కుట్రకు పాల్పడిన వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధిత ఇస్లామిక్ సంస్థ పీఎఫ్ఐలో క్రియాశీలకంగా పని చేస్తున్న పది మందిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం అర్ధరాత్రి సైదాబాద్, బాబా నగర్, సంతోష్ నగర్, చంపాపేట్, మూసారాంబాగ్‌లలో సోదాలు నిర్వహించి అనుమానితులను పట్టుకున్నారు. 2005లో టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై జరిగిన బాంబు దాడి కేసులో నిందితుడిగా ఉన్న జావేద్‌ను కూడా సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను ఇప్పటికే ఉగ్ర కార్యకలాపాల కోసం ఆరుగురిని రిక్రూట్ చేసుకున్నట్టు సమాచారం. నగరంలో దాడులకు పాల్పడి మత ఘర్షణలు స‌ృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో సిట్ ఈ దాడులు నిర్వహించింది. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలే టార్గెట్‌గా పెట్టుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించే అవకాశముంది. కాగా, పీఎఫ్ఐని దేశ వ్యాప్తంగా ఐదేళ్ల పాటు కేంద్రం నిషేధించిన విషయం తెలిసిందే.