Home > Featured > వినాయక చవితికి బాణాసంచా కాలిస్తే కఠిన చర్యలు

వినాయక చవితికి బాణాసంచా కాలిస్తే కఠిన చర్యలు

హైదరాబాద్ నగరంలో వినాయక చవితి వేడుకలను సెప్టెంబర్‌ 2 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. ఈ సమయంలో బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు. ఈ నిషేధం 2వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 12వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతియుత వాతావరణంలో వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని నగర ప్రజలను కమీషనర్ అంజనీ కుమార్‌ సూచించారు.

Updated : 20 Aug 2019 7:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top