దొంగోడి అకౌంట్ నుంచి రూ.5 లక్షలు కొట్టేసిన ఇన్‌స్పెక్టర్‌ - MicTv.in - Telugu News
mictv telugu

దొంగోడి అకౌంట్ నుంచి రూ.5 లక్షలు కొట్టేసిన ఇన్‌స్పెక్టర్‌

May 10, 2022

చోరీ కేసులో అరెస్టు చేసిన నిందితుడి అకౌంట్ నుంచి రూ.5 లక్షలు కొట్టేశాడు ఓ ఇన్స్పెక్టర్. బెయిల్ పై బయటకు వచ్చిన నిందితుడు తన డెబిట్ కార్డ్ నుంచి మనీ విత్‌డ్రా అయ్యాయని తెలిసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా అసలు దొంగవరో బయటపడింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది
ఈ ఏడాది ఫిబ్రవరిలో టైర్లు దొంగిలించాడనే నేరం మీద అగర్వాల్ అనే వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అతడి డెబిట్ కార్డును సీజ్ చేశారు. కానీ ఆ డెబిట్ కార్డ్ నుంచి అరెస్ట్ చేసిన ఇన్‌స్పెక్టర్‌ రూ. 5లక్షలు విత్ డ్రా చేశాడు.

నిందితుడు జైలులో ఉన్నప్పుడు ఇన్‌స్పెక్టర్.. అతని బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేశాడు. ఇటీవలె బెయిల్ మీద బయటకు వచ్చిన నిందితుడు తన బ్యాంక్ ఖాతా నుంచి కార్డు వినియోగించి భారీగా డబ్బు విత్‌డ్రాలు జరిగినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. బ్యాంకును సంప్రదించగా రూ.5 లక్షలు ఏఏ ఏటీఎమ్ విత్ డ్రా జరిగాయో తెలుసుకొని ఈ విషయాన్ని వెంటనే రాచకొండ పీఎస్‌కు చెందిన ఉన్నతాధికారులకు తెలిపాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించటంతో రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ అంతర్గత విచారణకు ఆదేశించారు. విచారణలో ఓ ఇన్స్పెక్టర్ ఈ అక్రమానికి పాల్పడినట్లు తేలింది. అతనిపై విచారణ కొనసాగుతోందని.. చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.