పాతబస్తీలో సెక్స్ రాకెట్.. ఏడుగురు మహిళలు అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

పాతబస్తీలో సెక్స్ రాకెట్.. ఏడుగురు మహిళలు అరెస్ట్

September 18, 2020

Hyderabad: Police busts prostitution racket in old city

పాతబస్తీలో సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది. పక్కా సమాచారంతో పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి ఈ ముఠాను పట్టుకున్నారు. ఈ ఘటన ఓల్డ్ సిటీ కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాబ్ సాబ్ కుంట బషారత్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బషారత్ నగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని కాలపత్తర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఇద్దరు నిర్వహకులతో పాటు, ఒక విటుడు, 7మంది బాధిత మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 

రూ.32 వేల నగదు, 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మిస్కిన్, తరన్నుమ్ అనే దంపతులు కలిసి గత కొన్ని రోజులగా ఈ వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. బాధిత యువతుల్లో ఇద్దరు వెస్ట్‌ బెంగాల్‌, ఒకరు కర్ణాటకకు చెందినవారు కాగా.. మిగిలినవారు పాతబస్తీకి చెందినవారిగా గుర్తించారు. దాడిలో పట్టుబడిన నిర్వాహకుడు, విటుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాధిత మహిళలను హోమ్‌కు తరలించామని చెప్పారు.