పోలీస్ పర్మిషన్లలో సమస్యలు ఉంటే సీపీని కలవండి  - MicTv.in - Telugu News
mictv telugu

పోలీస్ పర్మిషన్లలో సమస్యలు ఉంటే సీపీని కలవండి 

January 21, 2020

police commissioner.

హైదరాబాద్ నగర ప్రజలకు పోలీసు విభాగం నుంచి అవసరమైన అన్ని అనుమతులను, సేవలను వేగంగా అదించడానికి ప్రయత్నిస్తున్నామని కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ప్రజలు వారి విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా వారి ముంగిటికే సేవలు అందించేందుకు తమ యంత్రాంగం కృషి చేస్తోందని తెలిపారు. పరిష్కారం కాని సమస్యలేవైనా ఉంటే రోజూ సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్య తనను తన కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్చని ఓ ప్రకటనలో కోరారు. 

పోలీస్ పర్మిషన్లను స్నేహపూర్వకంగా, అవినీతికి తావులేకుండా మంజు చేస్తున్నామని వివరించారు. సమాచారలోపం లేకుండా ఉండేందుకు హోటళ్లు, మల్లీపెక్సులు, తదితర సంస్థలు తమ తాజా ఫోన్ నంబర్లను, ఈమెయిల్ చిరునామాలను ఎప్పటికప్పుడు తమకు పంపాలని కోరారు. తుపాకీ లైసెన్సు ఉన్నవారు, చట్టబద్ధంగా పేలుడు పదార్థాలు వాడేవారు కూడా తమ ఫోన్ నంబర్లను, ఈమెయిళ్లను అప్ డేట్ చేసుకోవాలని సూచించారు. దీని కోసం 9490616880 నంబరు, [email protected] ను వాడుకోవచ్చన్నారు.