లాక్‌డౌన్ ఎఫెక్ట్..రెండు లక్షల వాహనాలపై కేసులు! - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్ ఎఫెక్ట్..రెండు లక్షల వాహనాలపై కేసులు!

April 1, 2020

Hyderabad police filed cases on 2 lakh vehicles in lock down time

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ఆంక్షలు విధించింది. లాక్ డౌన్ ను విజయంవంతం చేయడానికి పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారు. అయినా కూడా కొందరు ఆకతాయిలు రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి వాళ్ళకు కొందరు పోలీసులు లాఠీ దెబ్బలను రుచి చూపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరికొందరు పోలీసులు ఎవ్వరూ బయటికి రాకూడదని దణ్ణం పెట్టి మరీ బతిమిలాడుతున్నారు.

లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మార్చ్ 23 వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు రోడ్లపైకి వచ్చిన దాదాపు 2 లక్షల వాహనాలపై పోలీసులు కేసులు నమోదు చేశారని  సమాచారం. కేసు నమోదు చేసిన వాటిలో 93393 టూవీలర్ వాహనాలు, 988 త్రీ వీలర్ వాహనాలు, 5041 ఫోర్ వీలర్ వాహనాలు ఉన్నాయన్నారు. వీరందరిపై వయోలేషన్ ఆక్ట్ కింద కేసులు ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో పాటు ట్రాఫిక్ పోలీసులు స్వయంగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో కూడా కొన్ని వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ డ్రైవ్ లో సరైన కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన 16651 వాహనదారులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులు నేరుగా పట్టుకున్న వాహనాల్లో 13249 టూవీలర్, 1999 త్రీ వీలర్, 1372 ఫోర్ వీలర్ వాహనాలు ఉన్నాయి. ఇప్పటివరకు 5029 టూవీలర్, 471 త్రీ వీలర్, 243 ఫోర్ వీలర్ వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.