Hyderabad police have increased the traffic fines
mictv telugu

వాహనదారులకు అలర్ట్.. ట్రాఫిక్ జరిమానా భారీగా పెంపు

November 19, 2022

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను మరింత కఠినతరం చేశారు. రాంగ్ రూట్లో ప్రయాణం, ట్రిపుల్ రైడింగ్‌‌లపై విధించే జరిమానాలను భారీగా పెంచారు. రాంగ్ రూటుకి రూ. 1700, ట్రిపుల్ రైడింగుకి రూ. 1200 జరిమానా విధించనున్నట్టు పోలీసులు తెలిపారు. నవంబర్ 28 నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్టు వెల్లడించారు. కెమెరాలకు చిక్కినా ఈ ఫైన్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించకపోతే బెంగళూరు లాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందుకే కాస్త కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్తున్నారు.