మంద కృష్ణ మాదిగ గృహ నిర్బంధం - MicTv.in - Telugu News
mictv telugu

మంద కృష్ణ మాదిగ గృహ నిర్బంధం

April 17, 2019

ఎంఆర్‌పిఎస్‌ నేత మంద కృష్ణ మాదిగను హైద్రాబాద్ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నగరంలోని డిడి కాలనీలో నివాసముంటున్న కృష్ణ మాదిగ నివాసానికి బుధవారం ఉదయాన్నే చేరుకున్న పోలీసులు ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. ఇంటి బయట భారీగా పోలీసులను మోహరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ దళితులను అవమానపరుస్తున్నారని, దళితుడైనందునే బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి ఉత్సవాల్లో పాల్గొనకుండా అవమానపరిచారని మంద కృష్ణ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కెసిఆర్‌ నియంతలా వ్యవహరిస్తూ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఎంఆర్‌పిఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

Hyderabad police house arrest mrps leader manda krishna madiga