Hyderabad Police Officers Numbers Changed
mictv telugu

HYD మారిన పోలీస్ అధికారుల నెంబర్లు.. కొత్తవి ఇవిగో

August 16, 2022

Hyderabad Police Officers Numbers Changed

నగర పోలీసు విభాగంలో పనిచేస్తున్న అధికారుల ఫోన్ నెంబర్లు మారిపోయాయి. ఇప్పటివరకు ఉన్న నెంబర్ల స్థానంలో ఎయిర్ టెల్ నంబర్లు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. 4జీ, 5జీలతో పాటు అనేక వాల్యూ యాడెడ్ సర్వీస్‌లను అందిచడానికి ఎయిర్ టెల్ ముందుకు రావడంతో తెలంగాణ పోలీసు విభాగం ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. నెంబర్ పోర్టబులిటీ కింద పాత నెంబర్లను కొనసాగించాలని తొలుత అనుకున్నా, అనేక ఇబ్బందులు వస్తుండడంతో నెంబర్లు మార్చాలని నిర్ణయించారు. గతంలో 9490 సిరీస్ ఉండగా, దానికి బదులుగా 8712660 సిరీస్‌ అందుబాటులోకి వచ్చింది. అయితే కొత్త నెంబర్లు వచ్చినా ప్రజలు అలవాటయ్యే వరకు నెల వరకు పాత నెంబర్లు అందుబాటులో ఉంచుతున్నారు. మారిన కొత్త నెంబర్లు ఇలా ఉన్నాయి.

► పోలీసు కమిషనర్‌– 8712660001
► అదనపు సీపీ (శాంతిభద్రతలు)– 8712660002
► అదనపు సీపీ (నేరాలు)– 8712660003
► సంయుక్త సీపీ (సీసీఎస్‌)– 8712660004
► సంయుక్త సీపీ (ఎస్బీ)– 8712660005
► సంయుక్త సీపీ (పరిపాలన)– 8712660006
► సంయుక్త సీపీ (ట్రాఫిక్‌)– 8712660007
► మధ్య మండల డీసీపీ– 8712660101
► ఉత్తర మండల డీసీపీ– 8712660201
► దక్షిణ మండల డీసీపీ– 8712660301
► పశ్చిమ మండల డీసీపీ– 8712660401
► తూర్పు మండల డీసీపీ– 8712660501
► టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ– 8712660701
► ప్రధాన కంట్రోల్‌ రూమ్‌: 871266000, 8712661000