సిటీ పోలీసులకు ధన్యవాదాలు...దర్శకుడు హరీష్ శంకర్ - MicTv.in - Telugu News
mictv telugu

సిటీ పోలీసులకు ధన్యవాదాలు…దర్శకుడు హరీష్ శంకర్

February 17, 2020

harish shankar.

దర్శకుడు హరీష్‌ శంకర్ తాను నివాసం ఉంటున్న జూబ్లీ ఎన్‌క్లేవ్ రెసిడెన్సీకి సమీపంలో అర్ధరాత్రి భవన నిర్మాణ పనులు చేపడుతున్నారని, దానివలన భారీ శబ్దాలు వస్తున్నాయని.. అక్కడ నివసించే ప్రజలకు ఇబ్బందిగా ఉందంటూ ఆదివారం రాత్రి ట్వీట్‌ చేస్తూ..జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ లను ట్యాగ్ చేశారు. జనావాస ప్రాంతాల్లో అర్ధరాత్రి పెద్ద శబ్ధాలతో భవన నిర్మాణాలు చేపట్టడానికి మీరు అనుమతిచ్చారా? అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

దీనికి వెంటనే స్పందించిన పోలీసులు అర్థరాత్రి భవన నిర్మాణ పనులు నిలిపేసేలా చేశారు. దీంతో హరీశ్‌ శంకర్ హర్షం వ్యక్తం చేశాడు. ఈరోజు మరో ట్వీట్ చేస్తూ..’నేను నమ్మలేకపోతున్నాను. కొన్ని నిమిషాల్లోనే ఆ శబ్దాలు ఆగిపోయాయి’ అని పేర్కొన్నారు. జూబ్లీ ఎన్‌క్లేవ్‌ రెసీడెన్సీలో నివాసముంటున్న వారందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.