బిత్తిరి సత్తిని ఇస్మార్ట్‌గా పార్సిల్ చేసిన పోలీసులు  - MicTv.in - Telugu News
mictv telugu

బిత్తిరి సత్తిని ఇస్మార్ట్‌గా పార్సిల్ చేసిన పోలీసులు 

September 12, 2019

బావ ఎక్కడైనా బావేగాని వంగతోట కాడ మాత్రం కాదు. ఎంత సెలబ్రిటీలైనా కొన్ని చోట్ల కొన్ని పద్ధతులు పాటించాలి. లేకపోతే పోలీసులు బిత్తిరి సత్తిని పార్సిల్ చేసినట్లు చేసేస్తారు. విషయంలోకి వస్తే.. ఈ రోజు ఉదయం ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని నిమజ్జనం కోసం ఎప్పట్లాగే  హుస్సేన్ సాగర్‌ వద్దకు తీసుకొచ్చారు. పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. అయితే మీడియా ప్రతినిధులు రిపోర్టింగ్ పేరుతో కొంత అతి చేశారు. అతికి మారుపేరైన బిత్తిరి సత్తి ఆరో నంబర్ క్రేన్ వద్ద బిత్తిరిబిత్తిరిగా ‘ఇస్మార్ట్’ రిపోర్టింగ్ చేశాడు.   

అసలే బిత్తరిసత్తి.. ఆపై జనసంద్రం నడుమ రిపోర్టింగ్.. ఇంకేముంది? జనం ఉసుళ్ల దండులా గుమికూడారు. షేక్ హ్యాండ్స్, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. పరిస్థితి గమనించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అదుపు చేశారు. భద్రతాపరంగా ఇది సరైన పని కాదని ఇన్‌స్పెక్టర్ సైదిరెడ్డి సత్తికి హితబోధ చేశారు. ‘మీరు ఇక్కడుంటే పబ్లిక్‌ను కంట్రోల్ చెయ్యడం మా వల్ల కాదు. ఇలా పక్కకు రండి’ అని తీసుకెళ్లారు. దీనిపై సత్తి సటైర్ వేశాడు. ‘నేను ఇక తిరిగిరాను. పోలీసోళ్లు నన్ను ఎక్కడికో ఫార్సిలింగ్ చేస్తున్నారు..’ అని అన్నాడు. సత్తి ఇటీవలే టీవీ9లో చేరి ‘ఇస్మార్ట్ వార్తలు’ అందిస్తున్న సంగతి తెలిసిందే.