ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్..హైదరాబాద్‌లో తిరగబడిన జనం - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్..హైదరాబాద్‌లో తిరగబడిన జనం

October 24, 2019

Hyderabad  ...

ఆర్టీసీ సమ్మెపై ప్రజల్లో కొద్ది కొద్దిగా అసహనం వ్యక్తం అవుతోంది. అటు ఆర్టీసీ, ఇటు ప్రభుత్వం ఎవరూ పట్టువీడక పోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎవరికి వారు సమస్యను జటిలం చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఓపిక నశించడంతో మలక్‌పేటలో ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చాలా సేపు బస్సుల కోసం చూసినా ఒక్క బస్సు కానరాలేదు. వచ్చిన బస్సులో కాలుపెట్టే సందులేదు. ప్రైవేటు వాహనాలు డబుల్ చార్జీలు వసూలు చేస్తుండటంతో తిరగబడ్డారు. 

నల్లగొండ క్రాస్ రోడ్ గురువారం ఉదయం  ప్రయాణికులు బస్సు కోసం గంట పాటు వేచి చూశారు. అయినా ఒక్క బస్సు రాకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయారు.ఇక లాభం లేదనుకొని.. నడి రోడ్డుపై ట్రాఫిక్‌ను నిలిపి రాస్తా రోకో నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఆర్టీసీ మొండి వైఖరితో సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోపంతో ఊగిపోయారు. దీంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇన్ని రోజులూ సమస్య సమసిపోతుందని ఓపిక పట్టిన ప్రజలు ఇక తమ కోపాన్ని బయటపెట్టారు. ఇకనైనా రెండు వర్గాలు దిగిరావాలని కోరుతున్నారు.