నేరస్తులు బరితెగిస్తున్నారు. హైదరాబాద్లో పట్టపగలు ఓ డాక్టర్ను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లాడు. వారిలో ఒకడు తనను కెమెరాలు గుర్తుపట్టకుండా ఒకడు బుర్ఖా వేసుకుని మరీ వచ్చాడు. బాధితుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.
హిమాయత్ సాగర్ దగ్గర్లోని ఎక్సైజ్ అకాడమీలో నివసిసిన బెహజాట్ హుసాన్ (57) అనే వైద్యుణ్ని దండుగులు ఆయన అపార్ట్ మెంటు నుంచి బయటికి లాక్కొచ్చి మరీ కిడ్నాప్ చేశారు. AP9 Y 0031 నంబర్ ఉన్న కారులో ఎక్కించుకుని ఎత్తుకుపోయారు. కుటుంబ కలహాలతో లేకపోతే, వ్యాపారం గొడవలతో ఈ కిడ్నాప్ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కారు ఆచూకీ కనుక్కోడానికి పోలీసులు చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.