హైదరాబాద్ నంబర్ వన్ సిటీ.. సర్వేలో వెల్లడి - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ నంబర్ వన్ సిటీ.. సర్వేలో వెల్లడి

September 16, 2020

hyd2

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో ఘనతను సాధించుకుంది. తాజాగా వెల్లడైన ఓ సర్వే ఫలితాల్లో దేశంలోనే నంబర్ వన్ సిటీగా నిలిచింది. భారత్‌లో పనికి అనువైన, నివాస యోగ్యమైన 34 అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ సర్వేను హాలిడిఫై.కామ్ అనే వెబ్‌సైట్ నిర్వహించింది. ఈ వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో ముంబై, పుణే, బెంగళూరు, చెన్నై నగరాలను అధిగమించి హైదరాబాద్ నంబర్ వన్ స్థానంలో నిలవడం గమనార్హం. 

హైదరాబాద్ నగరంలో పర్యటించడానికి సెప్టెంబర్-మార్చి మధ్య కాలం అత్యంత అనువైందని ఈ సర్వే వెల్లడించింది. దక్షిణ భారత న్యూయార్క్ నగరంగా హైదరాబాద్ మారుతోందని ఈ వెబ్‌సైట్ ప్రశంసించింది. దీని గురించి ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్వీట్ చేస్తూ.. ‘హైదరాబాద్ నగరం మరోసారి అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక జాతీయ సర్వేలు, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఉత్తమ నగరంగా నిలిచిన భాగ్యనగరం.. మరోసారి దేశంలోనే బెస్ట్ సిటీగా నిలిచింది.’ అని తెలిపాడు. అలాగే తెలంగాణ మున్సిపల్ మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేశాడు. దీనిని మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేస్తూ గౌతమ్ కి ధన్యవాదాలు తెలిపారు.