హైదరాబాద్‌లో వడ్డీ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో వడ్డీ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

October 22, 2019

రాజధాని నగరంలో సోమవారం దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంటి తలుపులు వేసినవి వేసినట్లే ఉన్నాయి. కానీ, ఇంటిలోపల దాచి ఉన్న బంగారం, వెండి, నగదు మాయమయ్యాయి. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాత బోయిన్‌పల్లి మల్లికార్జున్‌నగర్‌లో ఉండే సరళ వృత్తి రీత్యా వడ్డీ వ్యాపారి. 

robbery.

ఆమె సోమవారం సాయంత్రం బోయిన్‌పల్లి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు అలాగే ఉండగా.. లోపల ఉన్న బంగారం, వెండి, నగదు మాత్రం మాయమయ్యాయి. వెంటనే ఆమె బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదున్నర కిలోల బంగారం, 7 కిలోల వెండి, రూ.18 లక్షల నగదు పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ తమకు ఫిర్యాదు అందిందని, చోరీ సొత్తు ఎంత అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఇది తెలిసిన వారి పనా.. లేదా దొంగల ముఠా పనా.. అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నామన్నారు.