ప్రయాణికులకు అలర్ట్ .. 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రయాణికులకు అలర్ట్ .. 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

May 28, 2022

హైదరాబాద్ వాసులకు అలర్ట్. జంటనగరాల్లో ప్రయాణికుల సౌకార్యార్ధం నడుస్తున్న 34 ఎంఎంటీఎస్ రైళ్లు రేపు అనగా ఆదివారం(మే 29) రద్దు కానున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనను విడుదల చేసింది. హైదరాబాద్‌ – లింగంపల్లి మధ్య నడిచే 18 సర్వీసులను, ఫలక్‌నుమా – లింగంపల్లి మధ్య నడిచే 14 సర్వీసులతోపాటు సికింద్రాబాద్‌ – లింగంపల్లి మధ్య నడిచే 2 ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొంది. లింగపల్లి-హైదరాబాద్ రూట్ లో 9 ఎంఎంటీఎస్ సర్వీసులు, హైదరాబాద్-లింగపల్లి మార్గంలో 9 సర్వీసులు , ఫలక్ నుమా-లింగంపల్లి రూట్లో 7 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్ నుమా మార్గంలో 7 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు అయ్యాయి. అవి కాక సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో 47150 నంబర్ గల సర్వీసును రద్దు చేశారు. అలాగే లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గంలో 47195 ఎంఎంటీఎస్ సర్వీసును క్యాన్సిల్ చేశారు.