Hyderabad: SSI caught red-handed..Two years in jail
mictv telugu

హైదరాబాద్: రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎస్సై..రెండేళ్ల జైలు శిక్ష

September 4, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ, ఓ వ్యక్తి నుంచి రూ. 10 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటనలో ఏసీబీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లంచం తీసుకుంటూ, పట్టుబడిన ఆ ఎస్సైకి కోర్టు..రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ, ఆదేశాలు జారీ చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న ఎస్సై కె.రాజేంద్ర గతంలో రాయదుర్గం పోలీస్ స్టేసన్‌లో ఎస్సైగా పనిచేశారు. జూన్ 2013లో స్వాధీనం చేసుకున్న ఇర్షాద్ ఖురేషీ వాహనాన్ని తిరిగి ఇచ్చేందుకు, రాజేంద్ర రూ. 10 వేలు డిమాండ్ చేశారు. దాంతో ఖురేషీ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. మాటు వేసిన ఏసీబీ అధికారులు..రాజేంద్రకు ఖురేషీ రూ.10 వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ క్రమంలో తాజాగా కేసును విచారించిన ఏసీబీ కోర్టు..నిందితుడైన ఎస్సై రాజేంద్రను దోషిగా పరిగణించి, రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 5 వేల జరిమానా విధించింది. ఒకవేళ జరిమానాను చెల్లించకుంటే జైలు శిక్షను మరో మూడు నెలలు పొడిగించాలని ఆదేశిస్తూ తీర్పును వెల్లడించింది.