ఫుడ్ డెలివరీ ఇవ్వడానకి వెళ్లిన స్విగ్గీ డెలివరీ బాయ్ ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. కుక్క మొరుగుతూ మీదికి దూకడంతో మూడు అంతస్తునుంచి కిందపడి చనిపోయాడు. బంజారాహిల్స్‌లోని లుంబినా రాక్ కాజిల్‌లో ఈ సంఘటన జరిగింది. మహ్మద్ రిజ్వాన్(23) అనే యువకుడు స్విగ్గీ ఏజెంట్¡గా పనిచేస్తున్నాడు. అతడు ఈ నెల 11న రాక్ కాజిల్ అపార్ట్ మెంట్స్‌లోని మూడో అంతస్తులో ఉంటున్న కస్టమర్‌కు డెలివరీ ఇవ్వడానికి వెళ్లాడు. ఇంటి తలుపు తట్టడంతో కస్టమర్ పెంచుకుంటున్న జర్మన్ షెపర్డ్ జాతి కుక్కు మొరుగుతూ అతనిపైకి దూకింది. రిజ్వాన్ భయపడి పరిగెత్తాడు. రెయిలింగ్ దాటి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ అతణ్ని కస్టమర్ దగ్గర్లోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించాడు. రిజ్వాన్ అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తమకు న్యాయం చేయాలని అతని బంధువులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.