Hyderabad team appointed Brian Lara as the head coach
mictv telugu

ఐపీఎల్ : హైదరాబాద్ టీం కోచ్‌గా మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్

September 3, 2022

Hyderabad team appointed Brian Lara as the head coach

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వచ్చే సీజన్‌కు హైదరాబాద్ జట్టు కొత్త కోచ్‌ను నియమించుకుంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ ప్రధాన కోచ్‌గా ఉండగా, అయనను తప్పించింది. ఆయన స్థానంలో ఇప్పటిదాకా జట్టుకు సలహాదారు, బ్యాటింగ్ కోచ్‌గా విధులు నిర్వర్తిస్తున్న వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసింది.

ఈ మేరకు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే మూడీ సేవలను కొనియాడుతూ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. కాగా, టామ్ మూడీ కోచ్‌గా ఉన్న 2013 – 2019 కాలంలో హైదరాబాద్ జట్టు మంచిగా రాణించింది. 2016లో ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. కానీ, గత సీజన్‌లో పేలవ ప్రదర్శనతో 8వ స్థానంలో నిలవడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.