Hyderabad: Tomorrow morning at 11.30 am mass national anthem across the state
mictv telugu

రేపు ఉదయం 11:30 గం.లకు ఎక్కడికక్కడే బంద్

August 15, 2022

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెల 16న (మంగళవారం) ఉదయం 11 .30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన చేపట్టనున్నారు. మంగళవారం ఉదయం 11:30 గంటలకు అన్ని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ల వద్ద.. విద్యార్ధులు, ఉద్యోగులు, వ్యాపారులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు.. ప్రతీ ఒక్కరూ జాతీయ గీతాలాపన చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, సంస్థలు, బ్యాంకులు, విద్యా సంస్థలు, మాల్స్, సినిమా థియేటర్లు ఇలా ప్రతిఒక్కచోట సామూహికంగా జాతీయ గీతాన్ని అలాపించి దేశభక్తిని చాటనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో పోలీస్‌శాఖ కీలకపాత్ర పోషించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపనలో నగర వాసులందరూ భాగస్వాములు కావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కోరారు. ఆ సమయంలో ఎక్కడివారు అక్కడే నిలబడి జాతీయ గీతాలాపన చేయాలని కోరారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన..ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, సంస్థలు, బ్యాంకులు, విద్యాసంస్థలు, మాల్స్, సినిమా థియేటర్లలో ఒక్కచోట సామూహికంగా జాతీయ గీతాన్ని అలాపించి దేశ భక్తిని చాటాలన్నారు. అంతేకాదు నగరంలో ట్రాఫిక్ జంక్షన్లలో సామూహిక జాతీయ గీతాలాపన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 11.30గంటలకు ట్రాఫిక్‌ను నిలిపివేసి.. అలారం మోగించే విధంగా మైక్‌ సిస్టమ్స్‌ ఏర్పాట్లను చేస్తున్నారు. జాతీయ గీతాలాపన సమయంలో క్రమశిక్షణ పాటించాలని కోరారు.