hydలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇక నుంచి బాదుడే - MicTv.in - Telugu News
mictv telugu

hydలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇక నుంచి బాదుడే

September 30, 2022

హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ రోజు రోజుకీ పెరుగుతుండడంతో ట్రాఫిక్ పోలీసులు దానికి తగ్గట్టు కొత్త నిబంధనలను తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు హెల్మెట్ లేకున్నా, లైసెన్స్ లేకున్నా, కారులో సీటు బెల్టు పెట్టుకోకున్నా, మితిమీరిన వేగంతో ప్రయాణించినా, నో పార్కింగ్ ప్లేసులో పార్కింగ్ చేస్తే జరిమానాలు విధించేవారు. ఇప్పుడు వీటికి అదనంగా మరిన్ని నిబంధనలను అమలులోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనదారులు కచ్చితంగా రూల్స్ పాటించాల్సిందేనని పోలీసులు ప్రకటించారు.

సిగ్నళ్ల వద్ద స్టాప్ లైన్ దాటితే రూ. 100 ఫైన్ చెల్లంచాలి. అలాగే ఫ్రీ లెఫ్ట్ లైన్ బ్లాక్ చేస్తే రూ. వెయ్యి జరిమానా విధిస్తారు. పుట్ పాత్‌లపై వస్తువులు పెట్టే దుకాణాదారులు, పాదచారులకు అడ్డంగా వాహనాలు నిలిపేవారికి, తోపుడు బండ్ల వారికి రూ. 600 జరిమానా విధిస్తారు. రోడ్లపై ట్రాఫిక్ తగ్గించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే ఎప్పటి నుంచి అమలు చేస్తారో ఇంకా స్పష్టత ఇవ్వలేదు.