Home > Featured > కట్టని చలాన్లపై బాదుడు నిజమేనా? 

కట్టని చలాన్లపై బాదుడు నిజమేనా? 

రోడ్డు ప్రమాదాల నియంత్రణతోపాటు, దోషులకు మరింత కఠిన శిక్షలు విధించేందుకు తీసుకొచ్చిన కొత్త మోటారు వాహనాల చట్టంపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. చట్టంలోని నిబంధనల ప్రకారం ఇప్పటి నుంచే పెంచిన చలాన్లు అమల్లోకి వచ్చాయని వార్తలు వస్తున్నాయి. అలాగే ఇంతవరకూ చెల్లించని చలాన్లు సెప్టెంబర్ 1 తర్వాత కొత్త నిబంధనల ప్రకారం భారీగా పెరిగిపోతాయని కొన్ని మెసేజీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. అయితే ఇవన్నీ అసత్య ప్రచారాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తోసిపుచ్చారు. వాటిని నమ్మకూడదని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

కొత్త వాహన చట్టం ప్రకారం జరిమానాలు ఇలా..

హెల్మెట్, సీట్ బెల్ట్ లేకపోతే రూ. 1000

లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5 వేలు

పరిమితికి మించి వాహనం వేగంగా నడిపితే రూ.5 వేలు

సిగ్నల్ జంప్, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ చేస్తే రూ.5 వేలు

మద్యం తాగి వాహనం నడిపితే రూ.10 వేలు ఫైన్

మైనర్లకు వాహనం స్తే రూ.25 వేల జరిమానా, ఏడాది పాటు వాహన రిజిస్ట్రేషన్ రద్దు

అంబులెన్స్ వాహనానికి దారి ఇవ్వకపోతే రూ.10 వేలు

ఓవర్ లోడింగ్, ట్రిపుల్ డ్రైవింగ్‌కు రూ.20 వేలు

డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడితే రూ.5 వేలు

ర్యాష్ డ్రైవింగ్ చేస్తే రూ.5 వేలు

Updated : 27 Aug 2019 4:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top