మీ ఇంటికొచ్చి చలాన్లు వసూలు చేస్తాం... తెలంగాణ పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

మీ ఇంటికొచ్చి చలాన్లు వసూలు చేస్తాం… తెలంగాణ పోలీసులు

May 3, 2022

పెండింగ్‌లో ఉన్న చలాన్లను చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం గత నెల మార్చి 1 న అమలుచేసిన డిస్కౌంట్ ఆఫర్‌కు విశేష స్పందన వచ్చింది. నెలన్నర రోజుల పాటు సాగిన ఈ ఆఫర్‌‌లో భాగంగా 3కోట్లకు పైగా చలానాలు క్లియర్ అయ్యాయి. 65శాతం కార్ల చలానాలు, 70శాతానికి పైడా బైక్‌ చలానాలు క్లియర్ కాగా.. పోలీసు శాఖకు రూ.300 కోట్లకి పైగా ఆదాయం లభించింది. అయితే చలానాల డిస్కౌంట్ ఆఫర్‌ ప్రకటించడంతో కనీసం 90శాతం చలాన్లు క్లియర్ అవుతాయని పోలీసులు అంచనా వేయగా.. ఆశించిన మేర క్లియర్ కాలేదు.

నగరానికి చెందిన 65 శాతం మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగా.. మిగతా 35 శాతం మంది ముందుకు రాలేదు. దీంతో అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి పెండింగ్ చలానాలు ఉన్న వాహనదారులపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఎవరైతే ఇంకా చలాన్లు చెల్లించలేదో నేరు వారి ఇంటి వద్దకే వెళ్లి చలాన్లు వసూలు చేస్తామని చెప్పారు. దీనిపై ఎలాంటి డిస్కౌంట్ ఉండదన్నారు. అయినప్పటికీ చలాన్లు చెల్లించకపోతే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని.. సదరు వాహనదారులు కోర్టులో జడ్జీ ముందు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని కూడా చెప్పారు.