కాచిగూడలో రైళ్లు ఇలా గుద్దుకున్నాయ్.. (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

కాచిగూడలో రైళ్లు ఇలా గుద్దుకున్నాయ్.. (వీడియో)

November 11, 2019

Today Train Accident CCTV Video.. #hyderabad

Posted by Shakeel Ahmed on Monday, 11 November 2019

హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఈ రోజు రెండు రైళ్లు ఢీకొనడంతో 12 మంది ప్రయాణికులు గాయపడ్డం తెలిసిందే. రెండు రైళ్ల మధ్య డ్రైవర్ కేబిన్‌లో ఇరుక్కుపోయిన లోకో పైలెట్‌ను 8 గంటల సహాయక చర్యల తర్వాత సురక్షితంగా బయటికి తీశారు. ఎంఎంటీఎస్ రైలు.. కర్నూలు నుంచి వస్తున్న హంద్రీ ఎక్స్ ప్రెస్‌ను వేగంగా వెళ్లి ఢీకొట్టిన దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో నమోదైంది. ప్రమాదం ధాటికి ఎంఎంటీఎస్ వెనక బోగీలు కొన్ని అడుగుల మేర ఎగిరిపడ్డాయి. రైళ్లు ఎక్కువ వేగంతో ప్రయాణించకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.