హైదరాబాద్ నగరం ఓల్డ్ సిటీలోని ఫలక్నుమాలో దారుణం జరిగింది. ఆ ఏరియాలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం డెలివరీ కాగానే వేడి కోసం ఇద్దరు శిశువులను డాక్టర్లు ఇంక్యుబేటర్లో పెట్టారు. ఇంక్యుటేటర్లో పెట్టి వదిలేయడంతో వేడికి ఇద్దరు శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి ఛాతీ భాగంలో కాలిన గాయాలు ఉన్నాయి.
డాక్లర్ల నిర్లక్ష్యం వల్లే శిశువులు మృతి చెందారంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. పిల్లలు పుట్టినప్పుడు వారి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని.. ఇంక్యుబేటర్లో వేడి వల్లే ఇద్దరు చనిపోయారని బాధితులు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన ఇద్దరు చిన్నారుల ఛాతీ భాగంలో ఉన్న గాయాలు కాలిన గాయాల్లాగే ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.