కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విషాదం నెలకొంది. ఆయన మేనల్లుడు జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు. సైదాబాద్ లో నివాసం ఉంటున్న కిషన్ రెడ్డి సోదరి లక్ష్మీ, బావ నర్సింహారెడ్డిల కుమారుడు జీవన్ రెడ్డి. ఆయన వయస్సు 47 సంవత్సరాలు. గురువారం సాయంత్రం జీవన్ రెడ్డి ఒక్కసారిగా పడిపోయాడు. దీంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జీవన్ రెడ్డి మరణించాడు. అస్వస్థతకు గురైన సమయంలో గుండెపోటు వచ్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా జీవన్ రెడ్డికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. జీవన్ రెడ్డి మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.