Home > Featured > హైదరాబాదుకు మరో ఘనత.. ఫార్ములా ఈ రేస్‌కు ఆతిథ్యం

హైదరాబాదుకు మరో ఘనత.. ఫార్ములా ఈ రేస్‌కు ఆతిథ్యం

ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరం ఇప్పటికే ఎన్నో ఘనతలను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో ఘనతకు వేదిక కాబోతుంది. దేశంలోనే తొలిసారిగా ఫార్ములా ఈ రేస్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరంగా హైదరాబాద్ నిలవనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న హైదరాబాదులో ఈ పోటీలు జరుగుతాయని ప్రపంచ మోటార్ క్రీడల సమాఖ్య బుధవారం అధికారికంగా వెల్లడించింది. ఈ విషయాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ పోటీలకు స్వాగతం పలికారు. ఈ రేస్ పోటీలను ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు మీదుగా నిర్వహించనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ పోటీలు హైదరాబాదుకు రావడానికి కేటీఆర్ ఎంతో కృషి చేశారు. కాగా, 2011 నుంచి 2013 వరకు గ్రేటర్ నోయిడాలో బుద్ధ్ అంతర్జాతీయ సర్య్కూట్‌లో ఫార్ములా వన్ రేసు జరిగింది. దాని తర్వాత ఇదే అతి పెద్దది.

Updated : 30 Jun 2022 1:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top