హైదరాబాద్‌‌: టికెట్ల కోసం తొక్కిసలాట..మహిళ మృతి! - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌‌: టికెట్ల కోసం తొక్కిసలాట..మహిళ మృతి!

September 22, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో దారుణమైన తొక్కిసలాట జరిగింది. ఈనెల 25న హైదరాబాద్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగబోయే మ్యాచ్‌ను వీక్షిచేందుకు టికెట్ల కోసం ఆయా రాష్ట్రాల నుంచి వేలాది మంది అభిమానులు నేడు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ స్పృహకోల్పోయింది. దాంతో అప్రమత్తమైన అధికారులు మహిళను ఆసుపత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళ్తే..తాజాగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు సీరిసుల టీ20 మ్యాచ్‌లు ప్రారంభమైన విషయం తెలిసిందే. మూడవ టీ20 సిరీస్ ఈ నెల 25న హైదరాబాద్‌లో జరగనుంది. ఆ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆయా రాష్ట్రాల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్ వద్దకు చేరుకున్నారు.

ఈ క్రమంలో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. మూడు వేల టికెట్ల కోసం 30వేల మందికి పైగా అభిమానులు తరలివచ్చారు. మహిళలు కూడా టికెట్స్‌ కోసం క్యూలైన్లలో నిలబడ్డారు. ఒక్కసారిగా టికెట్ల కోసం యువకులు ఎగబడటంతో గేటు వద్ద టికెట్ కోసం క్యూలో ఉన్న మహిళ తొక్కిసలాటలో స్పృహకోల్పోయింది. వెంటనే అధికారులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆ మహిళ మృతి చెందినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.

 

 

 

ఈ ఘటనపై అడిషనల్ సీపీ చౌహాన్ మాట్లాడుతూ..”తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిందని ప్రచారం బాగా జరుగుతుంది. కానీ, అదంతా అబద్దం. తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదు. గాయపడిన మహిళ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. హెసీసీఏ సరైన వసతులు కల్పించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉంది. వదంతులను నమ్మొద్దు” అని ఆయన అన్నారు.