హైదరాబాద్ గెలిచింది.. ముంబై ఓడింది - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ గెలిచింది.. ముంబై ఓడింది

May 18, 2022

ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచ్‌లు రసవత్తరంగా జరుగుతున్నాయి. ప్లేఆఫ్స్ రేసు కోసం జట్టుల మధ్య యుద్ధం జరుగుతోంది. యువ బౌలర్లు, యువ బ్యాటర్లు రెచ్చిపోయి భారీ స్కోర్ చేస్తున్నారు. మొదట్లో వరుసగా పరాజయాలు పొందిన జట్లు రాను రాను విజృంభించి ఆడుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ముంబై, హైదరాబాద్ జట్ల మధ్య ఉత్కంఠ భరితమైన మ్యాచ్ జరిగింది.

మొదటగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. గార్గ్ 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో (42) పూరన్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో (38) పరుగులు చేయగా, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రాహుల్ త్రిపాఠి 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో (76) పరుగులు చేశాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి, 190 పరుగులు చేసి విజయం ముంగిట బోల్తా పడింది. కానీ, టిమ్ డేవిడ్ హైదరాబాద్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. వెంట వెంటనే మూడు సిక్సర్లు కొట్టి చివరి బంతులో రన్‌ఔట్ అయ్యాడు.ఈ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించినా ప్లే ఆఫ్స్ అవకాశాలు మాత్రం దాదాపు మూసుకుపోయాయి.