పెళ్లికాని ప్రసాద్ లు C/O హైద్రాబాద్ - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లికాని ప్రసాద్ లు C/O హైద్రాబాద్

July 3, 2017

పెళ్లెప్పుడవుతుంది బాబు నాకు పిల్ల యాడ దొర్కుతుంది బాబూ..ఇగో ఇదే ఇప్పుడు పట్నంలో ఉండే పెళ్లికాని యువకులందరి గుండెలోతుల్లోంచి వచ్చే పాట,బెండకాయ ముదిరనట్టు ముదిరిపోతున్నా పెళ‌్లి ముచ్చట తీరని పెళ్లికాని ప్రసాద్ ల సంఖ్య పట్నంలో రోజు రోజుకు పెరిగిపోతుంది.

బ్యాచిలర్ బాబుల కష్టాలు..!

పట్నంలో కొన్నిచోట్ల బ్యాచ్ లర్ బాబులకు రూం దొరకని పరిస‌్టితి..ఫ్యామిలీ ఉంటేనే రూం రెంట్ కిస్తాం అని కొందరు ఇంటి యజమానులు పెట్టే ఆంక్షలు.వంటకోసం రోజు చేతులు కాల్చుకుంటూ..సమయంలేనప్పుడు బైటి ఫుడ్డు తింటూ బ్యాచిలర్ బాబుల కష్టాలు అన్నీ ఇన్నీకావు.వూళ‌్లో ఎకరాల పొలం ఉన్నా వేలు సంపాదించే ఉద్యోగం ఉన్నా పిల్లనివ్వటానికి ముందుకు రానీ ఆడపిల్ల తల్లిదండ్రులు.ఊళ్లో ఎకరాల మాట దేవుడెరుగు నెత్తిమీద ఎకరాల కెకరాలు పోతూ బట్టతల ఐతున్నా ఇంకా పెళ్లి అవుతలేదని భాదపడుతున్న ముదురు బ్యాచ్ లర్ లు ఎందరో…

కట్నం వద్దన్నా కనికరించని ఆడపిల్లల తల్లిదండ్రులు..!

నాకు బుడ్డ పైస కట్నం అద్దు..మీ పిల్లను బంగారంలెక్క సూస్కుంట అని హామీ ఇచ్చినా కూడా ఆడపిల్లల తల్లిదండ్రులు పిల్లనిచ్చేతందుకు ముందుకు రావడంలేదు, అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉందా..అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడా,సాఫ్ట్ వేర్ ఇంజనీరా  లేకపోతే ఎన్కపొంటి గట్టిగ ఆస్తులు ఏమైనా ఉన్నయా ఇవే ఇప్పడు ఆడపిల్లల తల్లిదండ్రులకు అల్లుడిని వెతికేటప్పుడు మొదటగా చూసేవి,తమ బిడ్డ పెళ‌్లైనంక ఏ కష్టం పడకూడదు..దండిగా ఆస్తులు మంచి ఉద్యోగం ఉంటే సేఫ్టీగా ఉంటుందని ఆడపిల్లల తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు.అందుకే  చిన్న ఉద్యోగాలు చేస్తూ బతుకు బండిని లాగిస్తున్న బ్యాచిలర్ల వైపు ఆడపిల్లల తల్లిదండ్రులు చూడడమే మానేసారు.

అందుకే చాలామంది బ్యాచ్ లర్లకు 30 దాటినా ఇంకా పెళ్లి కావడంలేదు,ప్రతీ 100 మంది అబ్బాయిలకు 87 మంది అమ్మాయిలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నా పెరిగిపోతున్న బ్యాచిలర్ బాబులను చూస్తుంటే ఆడపిల్లల సంఖ్య ఇంకా తక్కువే ఉందని తెలుస్తుంది.దీనకి ఓ కారణం  ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే వాళ్లకు సమాది కట్టేస్తున్న ఎందరో తల్లిదండ్రులు.సంబందాలు చూసీ చూసీ ఎవ్వరూ పిల్ల నివ్వకపోవడంతో  అసలు పెళ్లి మీదనే విరక్తి పుడుతున్న బ్యాచిలర్ బాబులెందరో..ఇంకొందరేమో మంచిగ సెటిల్ అయినంక చేస్కుందాం అని ముప్పై ఏండ్లు దాటినా పెళ్లికి నో అంటున్నారు…తీరా సెటిల్ అయిన తర్వాత తగిన జోడీ దొరక్క అల్లాడిపోతున్నారు.కొందరు కులాంతర వివాహాలకు కూడా సై అంటున్నారు.సో వయసు మీద పడుతున్నా ఇంకా పెళ్లికాని బ్యాచిలర్ బాబులు కట్నంకు ఆశపడో…ఇంకా మంచి సంబందం వస్తుందని ఎదురు చూడకుండా జల్ధిన లగ్గం చేస్కోండి.