ఈ కార్పొరేటర్లకు ఏమైంది..? - MicTv.in - Telugu News
mictv telugu

ఈ కార్పొరేటర్లకు ఏమైంది..?

July 5, 2017

నగరంలో కార్పొరేటర్లకు ఏమైంది. ఎందుకిలా చేస్తున్నారు.ఎవరూ నోరు మెదపరేంటి..ఎంతకాలం మౌనంగా భరించాలి.?వీరి ఆగడాలు ఆగేదెప్పుడు..కంత్రీ పనులకు చరమగీతం పాడేదెప్పుడు..?

హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ.బెస్ట్ లీవింగ్ సిటీ.ఎంప్లాయింగ్ ప్లాట్ ఫామ్.అన్నింట్లో ఫేమస్.హైదరాబాద్ బిర్యానీ నుంచి టూరిస్ట్ ప్లేసెస్ దాకా ధునియా కెరుక. ఒక్క దాంట్లో మాత్రం తప్ప.ఎందులో అంటే జీహెచ్ ఎంసీ…దాన్ని కార్పొరేటర్ల విషయంలో..ఇది జనంలో ఉన్న మాట. జీహెచ్ ఎంసీ కార్పొరేటర్ల తీరు మరి దారుణంగా ఉంటుంది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు..అందరూ ఇలాగే చేస్తున్నారు. వీరి ఆగడాలు ఇంతకు ముందు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్ల ట్విట్టి ట్విట్టి పోశారు. అయినా మారలే. మళ్లీ అదే దారి..అడ్డాదారి..అరాచకదారి..ఎందుకిలా చేస్తున్నారు.?వీళ్లకు కళ్లెం వేసెదెవరు..?

సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారు. మాట వినని వాడి అంతు చూస్తామంటూ రౌడీయిజం చేస్తున్నారు. ఎదురు తిరిగితే బొక్కలు విరగొట్టిస్తున్నారు. భూ వివాదాల్లో ,కబ్జాల్లో మరి రెచ్చిపోతున్నారు. ఫలానా మంత్రి అనుచరులమంటూ చెలరేగిపోతున్నారు. కొందరు కార్పొరేటర్ల దెబ్బకు బాధితులు మంచానికే పరిమితమయ్యారు. ఇంకొందరు బాధితులు ఎవరికి చెప్పాలో తెలియక తమలోనే తాము ఆందోళన చెందుతున్నారు. మరికొందరు బాధితులు ధైర్యం చేసి కార్పొరేటర్లపై కంప్లయింట్లు ఇస్తున్నారు. అయినా న్యాయం జరగడం లేదు. పార్టీ హైకమాండ్లు కార్పొరేటర్లని పల్లెత్తు మాట అనడం లేదు. వీళ్ల ఆగడాల్ని నియంత్రించేదెవరు..ముకుతాడే వేసే వారే లేరా..?

గల్లీల్లో వీళ్ల అనుచరులదే రుబాబు. ఎవడు ఇళ్లు స్టార్ట్ చేసినా వీళ్లకు మామూళ్లు ఇచ్చుకోవాల్సిందే. లేదంటే కిరికిరి తప్పదు. కన్ స్ట్రక్షన్ ఆగిపోవాల్సిందే. ప్లాట్ అమ్మనా, కొన్నా వీళ్ల కమీషన్లు వీళ్లకు ఇవ్వాల్సిందే. ఏదైనా వివాదాల్ని పరిష్కరిస్తే ఏ రేంజ్ ముట్టచెప్పాల్సిందే. కార్పొరేటర్ హవా బట్టి పర్సెంటేజ్ లు ఉంటాయి. ఇదంతా బహిరంగా రహస్యమే. ఎందుకు లే వీళ్లతో గొడవ..ఎంతో కొంత ఇస్తే పోలా..అంటూ బాధితులు సర్దుకుపోతున్నారు. ఏ డివిజన్ లో చూసినా ఇంతే..దేనికి ఏదీ మినహాయింపు కాదు.కాకపోతే ఎవరి రేంజ్ వారిది.

పార్టీలు మారిన కార్పొరేటర్లపై బోలెడు ఆరోపణలు ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్న గల్లీల్లో వీళ్లదే రాజ్యం.చట్టం గిట్టం ఉండదు. వీళ్ల మాటే శాసనం. గీసిన గీత దాటితే చుక్కలే. పండుగ,పబ్బాల్లో వీరిదే హవా..ఎవరూ ఎదురు మాట్లాడొద్దు..న్యాయం ఎవరి వైపు ఉన్నా ప్రశ్ననించొద్దు. అన్ని… వినాల్సిందే.వినకపోతే తాట తీస్తారు..అంటున్నారు బాధితులు.

బయట ఇలా రెచ్చిపోయే కార్పొరేటర్లకు గల్లీల్లో సమస్యలు పట్టవు. డివిజన్ లో గుంతల రోడ్లు అస్సలు కనిపించవు. కాంట్రాక్టర్లు రోడ్డు మధ్యలో తవ్వి వదిలేసినా పట్టించుకోరు. బస్తీల బాధలు పట్టవు. ప్రజలు సమస్యలు వినిపించినా చెవికెక్కవు. అబ్బబ్బో ఎవడేం చెప్పినా తాము అనుకున్నది చేసిటోళ్లే నయా కార్పొరేటర్లు. ఒకరిద్దరు కార్పొరేటర్లు మంచి పనులు చేస్తున్నా..వీరి ఆగడాల్లో కొట్టుకుపోతున్నాయి.

ఇంకా ఎన్నాళ్లీ అరచకాలు…కళ్లెం పడెదెప్పుడో.. ఏ పార్టీ కార్పొరేటర్ ను ఆ పార్టీ పెద్దలు పిలిచి ఓ వార్నింగ్ ఇవ్వండి..వినకపోతే వేటు తప్పదని హెచ్చరించండి.లేదంటే బాధితులు పెరిగే కొద్ది.. సోషల్ మీడియా యుగంలో అసలు స్ట్రాటజీకే ఎసరు రావొచ్చు. జర ఆలోచించండి పెద్ద సార్లూ…అడ్డు, అదుపూ లేని కార్పొరేటర్ల సంగతి చూడుండ్రి..జనంతో జై కొట్టుంచుకొండ్రి…