'త్వరలోనే హైదరాబాద్ ఫైల్స్': మురళీధర రావు - MicTv.in - Telugu News
mictv telugu

‘త్వరలోనే హైదరాబాద్ ఫైల్స్’: మురళీధర రావు

March 21, 2022

JYF

‘కాశ్మీర్ ఫైల్స్‌’ లాగా త్వరలోనే ‘హైదరాబాద్ ఫైల్స్’ కూడా వస్తుందని బీజేపీ జాతీయ నేత మురళీధరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..”హైదరాబాద్ నుంచి ఇస్లామాబాద్ వరకు ఎంఐఎం టెర్రర్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తోంది. నిజామాబాద్, బైంసా, నిర్మల్, బోధన్ ప్రాంతాలను ఉగ్రవాదానికి అడ్డాగా మార్చారు. దీనికి టీఆర్ఎస్, పోలీసులు సహకరిస్తున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్‌లో లవ్ జిహాద్ కేసులలో పురోగతి లేదు. బోధన్‌లో హిందులను అక్రమ అరెస్టులు చేశారు. అసలు తెలంగాణ భారతదేశంలో ఉందా? లేదా పాకిస్థాన్‌లో ఉందా?” అంటూ ఆయన మండిపడ్డారు.

అంతేకాకుండా హిందువుల సంఖ్య ఎందుకు తగ్గింది..!? అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసిపోయి కుట్రలు చేస్తున్నారు. మొన్న నిర్మల్, నిన్న భైంసా, నేడు బోధన్ వరకు ఉగ్రవాదుల కారిడార్‌గా మారుస్తున్నారు అని విమర్శించారు. మతోన్మాద, ఉగ్రవాద కార్యకలాపాలకు కారణం కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. హిందువుల ప్రాణాల, ఆస్తుల నష్టానికి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి మహమూద్ ఆలీ రోహింగ్యాలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నుంచి హిందులు వలసలు ఎందుకు జరిగాయని నిలదీశారు. 1970 తర్వాత ఎందుకు హిందువుల సంఖ్య తగ్గిందో తెలియాలన్నారు.