లక్షజీతం వదిలి రూపాయి కోసం..! - MicTv.in - Telugu News
mictv telugu

లక్షజీతం వదిలి రూపాయి కోసం..!

July 3, 2017

లక్షరూపాల జీతం వదిలేసి ఫుట్ పాత్లపైన పడుకుంటామా?

పంచబక్షపరమాన్నాలు తినే వీలున్నా 5 రూపాల భోజనం చేస్తామా?

దర్జాగా కారులో తిరగే స్థోమత ఉన్నా… కాలి నడకన తిరుగుతేనే ఆనందం అని అనుకుంటామా?

ఇలా ఎవరన్నా చేసారన్కోండి..వాన్కేదో పిచ్చివట్టింది,బంగారమసొంటి జీవితాన్ని కాదన్కున్నడు, ఇలా ఒక్కొక్కలు ఒక్కోరకంగా అన్కుంటారు కదా…కనీ ఈ మన్షి ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్..నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతా అని అంటున్నాడు.

నెలకు లక్షరూపాయల జీతం  లగ్జరీ లైఫ్ ఇవేవి అతనికి కిక్కునివ్వలేదు,అందుకే సివిల్ ఇంజనీర్గ ఎంతో అనుభవం సంపాదించినా.. చేస్తున్న వృత్తిని వదిలేశాడు.చిత్తూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్ రావ్ సివిల్ ఇంజనీర్ గా పెద్ద పెద్ద కంపెనీళ్లో పనిచేసాడు అయినా ఏదో లోటు అందుకే  తనకు ఇష్టమైన సంగీతాన్ని నేర్చుకోవడం మొదలు పెట్టాడు,అంతే తాను నేర్చుకున్న విద్యను అందర్కి పంచాలని చేతిలో ప్లూటు గిటారు,కీబొర్డు పట్టుకొని జబ్బకు ఓ బ్యాగు తగిలించుకొని హైద్రాబాద్ లో పాదం మోపాడు.

5 రూపాయల భోజనం తింటూ… ఫుట్ పాత్ పై పడుకుంటూ..!

హైద్రాబాద్ లోని కెబీ ఆర్ పార్కు జలగం వెంగళరావ్ పార్కుల చుట్టు ఉదయం సాయంత్రం భుజానికి సంగీత పరికరాలు వేస్కొని తిరుగుతుంటారు,రవీంద్రభారతి నెక్లెస్ రోడ్డు ప్రాంతంలో కూడా కనిపిస్తాడు .సంగీతం నేర్పిస్తానని తనను తాను పరిచయం చేస్కంటూ అందరికి సంగీత బోదన చేస్తున్నారు.తన భోజనం ఖర్చుకోసం ఫీజుగా 1 రూపాయి మాత్రం తీస్కుంటారు.ధనిక,పేద చిన్న పెద్ద అనే తేడాలేకుండా  నేర్చుకోవాలనే తపన ఉన్న వారందరికి ఇతను సంగీతం నేర్పిస్తాడు.మధ్యాహ్నం  మున్సిపాలీటీ వాళ్లు పెట్టిన 5 రూపాయల భోజనం చేస్తూ…రాత్రి ఎక్కడ చోటు దొరికితే అక్కడ నిద్రిస్తాడు.లక్ష రూపాయల జీతం తీస్కున్నప్పుడు నేను జీవించిన జీవితంకంటే ఇప్పడే నాజీవితం బాగుందని నేను చాలా సంతోషంగా ఉన్నానని చెబుతాడు,నా జీవిత లక్ష్యం వీలైనంతమందికి సంగీతం నేర్పడమే అని నవ్వుతూ చెబుతాడు.

కానీ నిజంగా ఈమన్షికి దండం పెట్టాల్సిందే  ఈరోజుల్లో కూడా ఇలాంటివారున్నారంటే నిజంగా ఆశ్చర్యమే…ఎంత సంపాదించామా ఎంత ఎనకేసామా అని లెక్కలేసుకుంటూ జీవితంలో పర్గులు పెడుతున్న ఈరోజుల్లో కూడా  మనసుకు నచ్చిన తీరు బ్రతుకుతున్నాడంటే  నిజంగా గ్రేట్ కదా.ఆనందం అనేది తమలోనే ఉందని గమనించక ప్రతీమనిషీ ఆనందంకోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాడు..కొందరు పైసల్లో వెతుక్కుంటే కొంతమంది పవర్లో ఇంకా చాలా వాటిల్లో వెతుక్కుంటారు.తమ లైఫ్ లో పరిపూర‌్ణమైన ఆనందాన్ని వదిలి యాంత్రిక జీవనం సాగిస్తున్న వారెందరో.