సంగారెడ్డి జైల్లో కొత్త ప్రయోగం..హైడ్రోఫోనిక్‌ ఫార్మింగ్‌ - MicTv.in - Telugu News
mictv telugu

సంగారెడ్డి జైల్లో కొత్త ప్రయోగం..హైడ్రోఫోనిక్‌ ఫార్మింగ్‌

December 4, 2019

Hydroponic Farming In Sangareddy Jail

ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావడమే కాదు.. వారు విడుదలయ్యాక తమ కాళ్లపై తాము నిలబడేందుకు కొన్ని వృత్తి విద్యల్లో శిక్షణ కూడా ఇప్పిస్తుండం తెలిసిందే.  ఇందులో భాంగా సంగారెడ్డి జైల్లో ఖైదీలకు హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ విధానంలో ఆకుకూరలు పండించడం నేర్పిస్తున్నారు. ఖైదీలకు కావాల్సిన ఆకు కూరల కోసం బయటకు వెళ్లకుండా నూతన విధానంలో అక్కడే పండిస్తూ వారికి మెలకువలు నేర్పిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వారంతా జైలు అధికారులను అభినందిస్తున్నారు. 

ఎక్కువ నీరు, స్థలంతో పనిలేకుండా పెంచడమే హైడ్రో ఫోనిక్ ఫార్మింగ్ అంటారు. వీటిని ముందుగా సీడ్ ట్రాక్‌లో కొబ్బరి పీచు పొడితో చిన్న చిన్న ప్లాస్టిక్ గ్లాసుల్లో విత్తనాల్ని మొలకెత్తిస్తారు. ఆ తర్వాత వాటిని పీవీసీ పైపుల్లో నాటి మొక్కల్ని పెంచుతారు. ఎక్కువ మోతాదులో మట్టి అవసరం లేకుండా వాటిలో రాళ్లు నింపి ప్రత్యేక పద్దతులు అవలంభిస్తారు. మొక్కలు పెరగడానికి కావాల్సిన పోషకాలను మ్యాక్రో సొల్యూషన్,ద్రావణాలు అందించి పెంచుతారు. దీని ద్వారా ఆర్గానిక్ ఆకుకూరలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇటువంటి విధానం వల్ల ఖైదీలు విడుదల అయిన తర్వాత ఉపాధిగా కూడా ఉంటుందని జైలు సూపరింటెండెంట్ శివకుమార్ తెలిపారు.