క్లోరోక్విన్‌తో ముప్పు.. గుండెపోటు, మధుమేహం, కోమా..  - MicTv.in - Telugu News
mictv telugu

క్లోరోక్విన్‌తో ముప్పు.. గుండెపోటు, మధుమేహం, కోమా.. 

April 9, 2020

hydroxychloroquine effect on covid

ఇప్పుడు అందరూ పట్టాల్లేని డాక్టర్లుగా మారిపోతున్నారు! ‘కరోనాకు అదేదే క్లోరోక్విన్.. హైడ్రాక్సీక్లోరోక్విన్.. అదేనయ్యా, మలేరియాకు వాడే మందు వేస్తున్నారంట కదా. బాగానే పనిచేస్తోందట కదా. ట్రంప్ కూడా మనల్ని అడుక్కున్నాడట కదా..’ అంటున్నారు. ఈమందు కరోనా లక్షణాలను తగ్గింస్తుందని వార్తలొస్తాయి. అయితే దాంతో చాలా దుష్ర్పభావాలు ఉన్నట్లు కొత్త అధ్యయనంలో వెల్లడైంది. 

కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్లో ఈ వివరాలు వచ్చాయి. సన్నీబ్రూక్స్ హెల్త్ సైన్సెస్ సెంటర్ కు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం.. హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్ల గుండె కొట్టుకోవడంతో(ఇర్రెగులర్ హార్ట్ బీట్) తేడాలు వస్తాయి. రక్తంలో గ్లూకోజ్ కూడా తగ్గుతుంది. నాడీసంబంధ అనారోగ్యం కూడా దరిచేరే అవకాశముంటుంది. ఆందోళన, గందరగోళం, మతిభ్రమించడం వంటి లక్షణాలకు దారితీయొచ్చు. క్లోరోక్విన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ లను అధిక మోతాదుల్లో తీసుకొంటే మూర్ఛ, కోమాతోపాటు గుండెపోటు కూడా వచ్చేస్తుంది. కోవిడ్ వైరస్‌కు ఈ మందులు ఫలితం ఇవ్వడం లేదని కూడా అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా వాటితో కీడు కూడా ఉంటుందని అధ్యయనకర్తలు హెచ్చరించారు. ఇటీవల అస్సాం డాక్టర్ ఒకరు క్లోరోక్విన్ తీసుకుని చనిపోవడం తెలిసిందే.