భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం.. ట్రంప్ హెచ్చరిక - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం.. ట్రంప్ హెచ్చరిక

April 7, 2020

హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ భారత్, అమెరికా మధ్య విధ్వేషాలను రగల్చింది. ప్రస్తుతం ప్రపంచాన్ని అంతటిని కరోనా పట్టిపీడిస్తున్న నేపథ్యంలో ఈ డ్రగ్ అవసరం ఎక్కువగా పడింది. భారత్‌లో దీని తయారీ ఎక్కువగా ఉండటంతో తమ దేశానికి ఎగుమతి చేయాలని భారత్‌ను అమెరికా కోరింది. కానీ భారత్‌లోనూ కరోనా కేసులు పెరగడంతో వీటి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఈ విషయం తెలిసిన ట్రంప్ తీవ్రంగా స్పందించారు. వైట్ హౌజ్‌లో జరిగిన టాస్క్ ఫోర్స్ బ్రీఫింగ్‌లో గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైన సమయంలో తమకు డ్రగ్ ఎగుమతి చేయని భారత్‌పై బదులు తీర్చుకుంటామని స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ అమెరికా, ఇండియా మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పారు. కానీ తమ దేశం క్లోరోక్విన్ కోసం ఆర్డర్ చేస్తే ఎందుకు తిరస్కరించారో అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. ఇది మోదీ నిర్ణయమని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు.  మరోవైపు కరోనా వైరస్‌ను నియంత్రించడంలో దీని పాత్ర ఎక్కువగా ఉంది. దీంతో మనదేశంలో ఇవి విరివిగా తయారు చేస్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. ఎన్నో దేశాలు వీటి కోసం ఆర్డర్ చేస్తున్నాయి. 

క్లోరోక్వీన్‌కు డిమాండ్ కూడా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది. దీనిపై విదేశాంగ మంత్రిత్వ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా విజృంభణతో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న పలు దేశాలకు అవసరమైన డ్రగ్స్‌ అందజేస్తామని వెల్లడించింది. ఔషధాల పంపిణీపై వస్తోన్న ఊహాగానాలను కొట్టిపడేసింది, ఈ విషయాన్ని రాజకీయం చేయాలనుకుంటున్న ప్రయత్నాలకు త్వరలోనే చెక్ పెడతమాని స్పష్టం చేసింది.