హైపర్ ఆది v/s  పూజిత (orphanage organizer) - MicTv.in - Telugu News
mictv telugu

హైపర్ ఆది v/s  పూజిత (orphanage organizer)

November 25, 2017

జబర్దస్త్’లో  హైపర్ ఆది అనాథలను  కించపరుస్తూ చెప్పిర డైలాగ్ వివాదానికి దారితీసింది. దీనిపై పలు అనాథాశ్రమ పిల్లలు, మహిళా సంఘాలు పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టారు. ఈవిషయంపై  టీవీ9 అనాథాశ్రమ నిర్వాహకులు, సామాజిక కార్యకర్తలతో,మహిళా సంఘాలతో డిబేట్ ఏర్పాటు చేసింది.

దీనిపై జబర్థస్త్ జడ్జ్  నాగబాబు  ‘నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రేక్షకులకు లేని బాధ మీడియాకు, మహిళా సంఘాలకు ఎందుకు అని అని టీవీ9 ద్వారా చెప్పారు. ఈ విషయంపై టీవీ9 హైపర్ ఆదికి ఫోన్ చేసింది. దీనిపై హైపర్ ఆది స్పందిస్తూ ‘పిల్లల్ను అనాథలు చేసే బ్యాడ్ పేరెంట్స్ గురించి చెప్పానే తప్ప, వేరే ఉద్దేశ్యం లేదు అని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

దీనిపై  ‘మాఇల్లు ప్రజాదరణ’ నిర్వాహకురాలు పూజిత  హైపర్ ఆదిని ‘ అసలు అనాథలు అంటే  నీకు అర్థం తెలుసా ? కేవలం పిల్లలను వదిలేసిన తల్లిదండ్రులే కాదు, ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలుంటారు, వేరే వేరే కారణాల వల్ల అనాథలైన పిల్లలుంటారు. మరి వారి తల్లిదండ్రులను ఇలా అవమానిస్తే వాళ్ల మనసులు ఎంత గాయపడతాయో నీకేం తెలుసు అని భారతదేశంలో 4 కోట్ల మంది అనాథలు ఉన్నారు.

వాళ్లందరూ కూడా చెడ్డ తల్లిదండ్రులకు పుట్టిన వారేనా, అసలు చెడ్డ తల్లిదండ్రులనే మాటే నీచంగా ఉంది’ అని  ఆదిపై మండిపడ్డారు. చౌకబారు రాతలు, బూతు రాతలు మానుకుంటే మంచిది అని మహిళా సంఘ కార్యకర్తలు ఆదిపై మండిపడ్డారు.