వైసీపీపై హైపర్ ఆది పంచులు.. ఫ్యాన్స్ ఫైర్.. ఫోన్ నెంబర్ లీక్ - MicTv.in - Telugu News
mictv telugu

వైసీపీపై హైపర్ ఆది పంచులు.. ఫ్యాన్స్ ఫైర్.. ఫోన్ నెంబర్ లీక్

June 10, 2022

జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన హైపర్ ఆది తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల ఓ స్కిట్ చేసిన ఆది.. అందులో వైసీపీని టార్గెట్ చేశాడని ఆ పార్టీ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన ఫోన్ నెంబరుని లీక్ చేసి బూతులు తిడుతున్నారు. ఇంతకీ వివాదం ఏంటంటే.. రీసెంట్‌గా చేసిన స్కిట్‌లో ఆది.. మీదే పార్టీ? అని అడుగుతాడు. దానికి ఒకరు మేం ఉన్నాం అని, మరొకడు మేం విన్నాం అని అంటాడు. దానికి ఆది ‘మేముంటాం’ అని కౌంటర్ వేస్తాడు. ఈ వీడియో క్లిప్ బయటకు రావడంతో వైసీపీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. రెండు రోజుల్లో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇంకొందరు ఆది ఫోన్ నెంబరుని షేర్ చేస్తూ.. ఫోన్ ఎత్తడం లేదు. ఎత్తితో విరుచుకుపడండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై ఆది స్పందన ఎలా ఉంటుందో చూడాలి.