కేటీఆర్ ట్వీట్‌ను సవాల్‌గా స్వీకరిస్తున్నా : కర్ణాటక పీసీసీ చీఫ్ - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్ ట్వీట్‌ను సవాల్‌గా స్వీకరిస్తున్నా : కర్ణాటక పీసీసీ చీఫ్

April 4, 2022

16

ఇండియన్ టెక్నాలజీ కేంద్రంగా పేరొందిన బెంగళూరులో ఇటీవల వసతుల లేమి వల్ల ఖాతాబుక్ సీఈఓ ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేశారు. దానికి వెంటనే స్పందించిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. ‘వెంటనే మూటా ముల్లె సర్దుకుని హైదరాబాదుకు వచ్చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉన్నాయ’ని ఆహ్వానించారు. ఇప్పుడీ విషయంపై కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సోమవారం స్పందించారు. ‘ మిత్రమా కేటీఆర్, మీ ఆహ్వానాన్ని సవాలుగా స్వీకరిస్తున్నా. 2023 చివరి నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. దేశంలో బెంగళూరుకు ఉన్న పేరును మేం తిరిగి నిలబెడతాం.’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో పరిశ్రమల కోసం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పోటీ గురించి టెక్ నిపుణులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. మౌలిక సదుపాయాల కోసం ఒక రాష్ట్రం మరొక రాష్ట్రంలో పోటీ పడడం వల్ల ఉన్న కంపెనీలు తమ సామర్థ్యం మేరకు పనిచేయడంతో పాటు, భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు ఈ రెండు నగరాల్లో పెట్టుబడులు పెట్టడానికి మరింత ముందుకు వస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.