I am a true Hindu.. I will die as a Hindu : KA Paul
mictv telugu

నేను నిజమైన హిందువుని.. హిందువుగానే చనిపోతాను : కేఏ పాల్

February 16, 2023

I am a true Hindu.. I will die as a Hindu : KA Paul

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిజమైన హిందువునని చెప్తూ హిందువుగానే చనిపోతానని షాకింగ్ కామెంట్స్ చేశారు. కానీ ఏసుక్రీస్తును ఫాలో అవుతానని అంతలోనే ట్విస్ట్ ఇచ్చారు. అంతకుముందు సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయానికి రూ. 600 కోట్లు కేటాయించడం పట్ల మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ అజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నారని, బీజేపీకి బీఆర్ఎస్ బీటీంగా పని చేస్తోందని విమర్శించారు. ఖజానాలో కాసులు లేవని చెప్తున్న కేసీఆర్.. రెండు దేవాలయాలకు కోట్ల రూపాయల ఇస్తున్నారని, ఒక్క మసీదు లేదా చర్చికి ఏనాడైనా డబ్బిచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని సెక్యులర్ ప్రజలు ఈ విషయంపై కేసీఆర్‌ని నిలదీయాలని కోరారు. కూతురు కవిత అరెస్ట్ తప్పించడానికే ఇంత డ్రామా ఆడుతున్నారని, కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ కాకపోవడానికి ఇదే నిదర్శనమన్నారు. భూములమ్మి కొండగట్టుకు నిధులు కేటాయించడంపై కోర్టును ఆశ్రయిస్తానని తేల్చి చెప్పారు. ఏప్రిల్ 14న సచివాలయం ప్రారంభించడానికి ఒప్పుకున్నారు కాబట్టి శుక్రవారం కలెక్టరేట్‌ల ముట్టడిని చేపట్టవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు కమ్యూనిస్టులు డబ్బుల కోసం కేసీఆర్ దగ్గరికే కాదు ఎక్కడైనా వెళతారని పాల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.