తెలంగాణ మంత్రి మల్లారెడ్డి..రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ‘ పాలు అమ్మినా, పూలు అమ్మినా, సక్సెస్ అయ్యా అంటూ మల్లారెడ్డి ఇటీవల కొడుతున్న డైలాగులతో బాగా ఫేమస్ అయపోయారు. ఆయన స్పీచ్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ పెరిగింది. తాజాగా మరోసారి తనమార్క్ డైలాగ్‌లతో రచ్చచేశారు మల్లన్న. యూట్యూబ్ స్టార్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘మేము ఫేమస్’ అనే చిత్ర టీజర్‌ను మల్లారెడ్డి రిలీజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు పవన్ కల్యాణ్ సినిమాలో విలన్ గా అవకాశం వచ్చిందంటూ చెప్పారు.
పవన్ సినిమాలో విలన్‌గా
‘ఉస్తాద్ భగత్ సింగ్’లో విలన్ క్యారెక్టర్ కోసం హరీష్ శంకర్ తనను సంప్రదించాడని మల్లారెడ్డి తెలిపారు. ఓ రోజు హరీష్ శంకర్ తన దగ్గరకి వచ్చి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యిపోయావు అన్నా. పవన్ కళ్యాణ్‌తో నేను తీసే సినిమాలో విలన్ గా నటిస్తావా అన్నా అని హరీష్ శంకర్ గంటన్నర సేపు బ్రతిమిలాడాడని చెప్పాడు. కానీ తను విలన్‌గా నటించనని చెప్పినట్లు తెలిపినట్లు మల్లారెడ్డి స్పష్టం చేశారు.
ప్రభాష్ది అంతా మేకప్
‘మేము ఫేమస్’ సినిమా గురించి మాట్లాడిన మల్లారెడ్డి హీరో సుమంత్ ప్రభాష్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ సమయంలో రెబల్ స్టార్ ప్రభాష్‌పై మంత్రి నోరుజారడం చర్చనీయాంశమైంది. ఆ హీరో ప్రభాస్ అందగాడు కాదని,అంతేకాదు ప్రభాస్ అంటే బోలెడు మేకప్ వేసుకుని ఉంటాడు, కానీ నువ్వు మేకప్ లేకుండానే స్మార్ట్ గా ఉన్నావంటై కామెంట్ చేశాడు. అసలైన మేకప్ లేని అందగాడు ఈ ప్రభాస్ అని మంత్రి అనడంతో అక్కడున్న వాళ్లంతో ఈలలతో గోల చేశారు.
నేను తుమ్మినా తుఫాన్
ఇటీవల కాలంలో తను చాలా ఫేమస్ అయినట్లు మంత్రి పేర్కొన్నారు. తను తుమ్మినా తుఫాన్ వస్తుందని తెలిపాడు. అయితే తను ఫేమస్ అవకడం వెనుక తను పడిన కష్టం, శ్రమ ఉందని మరోసారి తన ఫ్లాష్ బ్యాక్ గుర్తుచేశారు. కష్టపడితేనే యువత ఫేమస్ అవుతారని తాను పాలమ్మి కష్టపడి కేసీఆర్ దయతో మంత్రి అయ్యానని మల్లన్న చెప్పుకొచ్చారు. ప్రపంచంలో నెంబర్ వన్ ఫేమస్ మంత్రి కేటీఆర్ అని కేటీఆర్ కృషి వల్లే హైదరాబాదులో గూగుల్ అమెజాన్ సంస్థలు వచ్చాయని కొనియాడారు. తనేం గొప్ప వ్యక్తి కాదని, సింపుల్ లివింగ్, లో ప్రొఫైల్, హై థింకింగ్ వల్లే ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చాడు. యువత చెడు మార్గాలు వైపు వెళ్లకుండా లక్ష్యం కోసం కృషిచేయాలని సూచించారు.