I am in love, I will introduce her soon : Vishal
mictv telugu

నేను లవ్‌లో ఉన్నా, ఆమెను పరిచయం చేస్తా.. విశాల్

July 8, 2022

యాక్షన్ కం ఫ్యామిలీ హీరో విశాల్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, త్వరలో ఆమెను మీ అందరికీ పరిచయం చేస్తానని మాటిచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్.. తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పందించాడు. ‘నాకు పెద్దలు కుదిర్చిన పెళ్లి సెట్ కాదు. ప్రేమ పెళ్లి చేసుకోవాలని ఉంది. అందుకే నేనే ఓ అమ్మాయిని ప్రేమించా. అన్నీ కుదిరితే మీ అందరికీ పరిచయం చేస్తా’నని వెల్లడించాడు. ఇంతకు ముందు అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన అనీషా రెడ్డిని ప్రేమించిన విశాల్.. ఆమెతో నిశ్చితార్ధం కూడా చేసుకున్నాడు. కానీ, కొన్నాళ్ల తర్వాత ఏమైందో కానీ, వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత వరలక్ష్మీ శరత్ కుమార్‌తో ఎఫైర్ ఉన్నట్టు వార్తలు వచ్చినా అవి నిజ రూపం దాల్చలేదు. ఇప్పుడు విశాలే స్వయంగా పెళ్లి విషయం మాట్లాడడంతో మిగిలిన రూమర్లకు చెక్ పెట్టినట్టయింది. అటు ఇప్పటికే మూడు పదుల వయసు దాటిన విశాల్ తొందరగా పెళ్లి చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, ఇటీవల లాఠీ సినిమా షూటింగ్ సందర్భంగా విశాల్ గాయపడిన విషయం తెలిసిందే. అయితే కాసేపు విశ్రాంతి తీసుకొని షూటింగ్ పూర్తి చేసిన విశాల్ అంకితభావం పట్ల పలువురు అతడిని ప్రశంసిస్తున్నారు.