అడల్ట్ మోడల్ అయిన మియా ఖలీఫాలో కొత్త కోణం వెలుగుచూసింది. ఇంతవరకు అడల్ట్ సినిమాల్లో అందాల ప్రదర్శన చేసిన ఆమె.. ఇటీవల తన కొత్త ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో తనకు బుక్స్ చదవడం బాగా ఇష్టమనీ, వాటి కోసం ఇంట్లోనే లైబ్రరీ ఏర్పాటు చేసుకున్న ఫోటోని అభిమానులతో పంచుకుంది. అంతేకాక, యూరప్ పర్యటనకు వెళ్లినప్పుడు బుక్స్ కోసం ప్రత్యేకంగా ఓ సూట్కేసు కొనుగోలు చేశానని తెలిపింది. అమెరికాలోని వాషిగ్టన్ డీసీలో ఉన్న తన ఇంటిలో ఉన్న బుక్స్ కోసం ఏదో ఒకరోజు నిచ్చెన కొనుక్కోవాల్సి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఆదివారం పోస్ట్ చేసిన ఫోటోలకు ఇప్పటికే లక్షల లైకులు రాగా, యూజర్లు తమకు తోచిన విధంగా కామెంట్లు పెడుతున్నారు.