సొంత తండ్రే కన్న కూతుర్లను లైంగికంగా వేధించిన దారుణమైన సంఘటనలను దేశవ్యాప్తంగా అనేకం చూసుంటాము. తాను వేధింపులకు గురయ్యానని ఇటీవల నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్భూ సుందర్ బయటి ప్రపంచానికి చెప్పడంతో సామాన్యులే కాదు సెలబ్రిటీలు ఇలాంటి వేధింపులను ఎదుర్కొంటున్నారని తెలిసింది. కన్నతండ్రే తనను లైంగికంగా వేధించాడని షాకింగ్ ఆరోపణలను చేశారు ఖుష్భూ అయితే ఇదే విషయంపై ఖుష్భూ మరోసారి స్పందించారు. నా తండ్రే నన్ను వేధించాడని చెప్పడానికి నేను ఏమాత్రం సిగ్గుపడటం లేదని అందులో సిగ్గుపడాల్సిన విషయం ఏమి లేదని ఖుష్భూ తెలిపారు. నాకు జరిగిన అన్యాయం గురించి ప్రపంచానికి చెప్పానన్నారు. నా పై జరిగిన ఆ దారుణమైన సంఘటనను అందరితో పంచుకోవడానికి ఇంత సమయం పట్టిందని, ప్రతి మహిళా తనపై జరిగే వేధింపులను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగాలన్నారు ఖుష్భూ.
రీసెంట్ గా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఝార్ఖండ్‌లో మీడియాతో మాట్లాడిన ఖుష్భూ తన 8 ఏళ్ల వయస్సులో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. తన సొంత తండ్రే తనను లైంగింకంగా వేధించాడని తెలిపి అందరిని ఆశ్యర్యానికి గురిచేశారు. 15 సంవత్సరాల వయసులో తన తండ్రిని దైర్యంగా ఎదురించి బయటపడిని విషయాలను వెల్లడించారు. ఖుష్భూ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట్లో సంచలనంగా మారాయి. తాజాగా తాను చేసిన కామెంట్స్‌పై మళ్లీ స్పందించిన ఖుష్భూ ఇందులో సిగ్గుబపడే విషయం ఏమీ లేదని తెలిపారు.